![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -254 లో.. కృష్ణ, ముకుంద, మురారి కలిసి షాపింగ్ కి వెళ్తారు. అంతకంటే ముందు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ సరదాగా గేమ్ ఆడతారు ముగ్గురు. ఎలాగైనా మురారి, ముకుందల ప్రేమ విషయం కృష్ణకి చెప్పాలని ముకుంద అనుకుంటుంది. మురారి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోవాలని కృష్ణ అనుకుంటుంది.
ఆ తర్వాత ముగ్గురు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. బాటిల్ మురారి వైపు ఆగేసరికి కృష్ణ ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీరు ముందు ప్రేమించిన అమ్మయి పేరు చెప్పండని కృష్ణ అడుగుతుంది. మురారి ఇబ్బందిపడుతు రాధ అని చెప్తాడు. ఆ తర్వాత ముకుంద వైపు బాటిల్ ఆగుతుంది. అప్పుడు నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరు చెప్పమని కృష్ణ అడుగుతుంది. కృష్ణ అని ముకుంద చెప్తుంది. అప్పుడు కృష్ణ ఇప్పుడు వేరే పేరు ఉందని ముకుంద చెప్తుంది. అప్పుడే ఇద్దరు కుర్రాళ్లు వచ్చి.. ఈ ఇద్దరిలో మీ భార్య ఎవరు సర్ అని మురారిని అడుగుతారు. మేం మా ఫ్రెండ్స్ అందరం, తనని మీ భార్య అని అనుకున్నామని ముకుందని చూపిస్తారు. ఒక్కడు మాత్రం ఈవిడ మీ భార్య అని అన్నాడని కృష్ణని చూపిస్తాడు.
దాంతో ఈవిడ నా భార్య అని కృష్ణని చూపిస్తాడు మురారి. అంతమందికి ముకుంద మీ భార్య అనిపించింది. ఒక్క అతనికి మాత్రం నేను మీ భార్య అనిపించింది ఎందుకలా అనిపించిందని ఆ అబ్బాయిని కృష్ణ అడుగుతుంది. ఏం లేదు మేడమ్, మీరు ట్రెడిషనల్ గా ఉన్నారు అందుకే అని ఆ అబ్బాయి చెప్తాడు. ఆ తర్వాత అంతమందికి ముకుంద భార్యలా అనిపించింది. నేను అనిపించలేదు ముకుంద ముందు నేను అంత తీసిపారేసినట్లు ఉన్నానా అని కృష్ణ ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి, ముకుంద బయలుదేరి వస్తుంటే కృష్ణ డల్ గా ఉంటుంది. కృష్ణని డల్ మూడ్ నుండి బయటకు తీసుకొని రావాలని మురారి అనుకుంటాడు. మరొక వైపు రేవతి, మధు ఇద్దరు ముకుంద తీరు గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |